అందరి విషయం నాకు తెలియదు కానీ నేను మాత్రం మళ్ళీ ఆ రోజులు వస్తే బావున్ను అని కోరుకొనే వాళ్ళల్లో ఓక్కడిని. కాకినడలో నేను ఇంజినేరింగ్ చేశాను. నాకు అక్కడ వింత వింత రకాలుగా రేగింగ్ జరిగేది. వాటిలో కోన్ని (చెప్పదగినవి)
1. టైలరు వద్దకు పోయి యెనభయ్యో నెంబరు సైజు డ్రాయరు కుట్టడానికి ఏంత తీసుకొంటావు అని అడగమనేవారు.
2. బడ్డీ కోట్టుకు పోయి అగ్గి పుల్లలు లూజ్ ఏంత అని అడగమనేవారు.
3. రోడ్డు మీద వెళ్తున్న ఏవరో అమ్మాయి పేరు కనుక్కోమనేవారు.
4. సినేమా హాల్లో ముందు కూర్చున్నతని చొక్కా మీద ఏన్ని పువ్వులు ఉన్నాయో లెక్కపెట్టమనేవారు.
5. అర్ధరాత్రి సేనియర్ రూమ్ కి వెళ్ళి అతన్ని నిద్ర లేపి హ్యేపీ నాగుల చవితి అని చెప్పమనేవారు.
6. పొద్దున్నే లేచి తడిగుడ్డలతో,అగరొత్తులతో ఇశ్వర్య ఫొటోకి పూజ చెయ్యమనేవారు.
ఈ రేగింగ్ పున్యమా అని సిగ్గు,లజ్జ,అభిమానమ్ లాంటివి అన్నీ మట్టి గోట్టుకోని పోయాయి. అప్పుడు భయపడినా ఇప్పుడు తల్చుకోని నవ్వుకొనే సంఘటనలు చాలా ఉన్నాయి.
Like this:
Be the first to like this post.
This entry was posted on సెప్టెంబరు 20, 2007 at 2:18 అపరాహ్నం and is filed under Uncategorized. You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.
3:45 అపరాహ్నం వద్ద సెప్టెంబరు 22, 2007
10:55 పూర్వాహ్నం వద్ద సెప్టెంబరు 23, 2007
బ్లాగులోకానికి స్వాగతం
మీ బ్లాగు కూడలి koodali.org, జల్లెడ jalleda.com లలో ఉండేట్టు చూడండి.
రాగింగ్ ఐడియాలు బాగున్నాయి. రాగింగ్ తరువాత మా మిత్రులు కొందరు రాటు తేలిన వైనం గుర్తుతెచ్చుకుంటే నవ్వొస్తుంది.
10:07 అపరాహ్నం వద్ద సెప్టెంబరు 23, 2007
ఇంతకీ ఫిజికల్ రాగింగ్ ఉండేదో లేదో రాయలేదు..? మా REC నాగ్‌పూర్‌లో ఉండేది.